Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పోలీసులపై చేయి చేసుకున్న వైఎస్ విజయమ్మ

YS Vijayamma slaps woman constable
Advertisement
  • పోలీసులపై దాడి కేసులో షర్మిల అరెస్ట్
  • జూబ్లీహిల్స్ పీఎస్ కు వెళ్లిన విజయమ్మను అడ్డుకున్న పోలీసులు
  • మహిళా పోలీసుపై చేయి చేసుకున్న విజయమ్మ
Advertisement
విధుల్లో ఉన్న పోలీసులపై చేయి చేసుకున్న వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు జూబ్లీహిల్స్ పీఎస్ కు తరలించారు. ఈ క్రమంలో తన కుమార్తెను కలిసేందుకు వైఎస్ విజయమ్మ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. అయితే, ఆమె స్టేషన్ లోకి వెళ్లకుండా పోలీసులు బయటే ఆపేశారు. ఈ క్రమంలో పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగారు. కారు వద్దే నిలబడి పోలీసులపై నిరసన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తనను అడ్డుకునేందుకు యత్నించిన ఒక మహిళా పోలీసుపై ఆమె చేయి చేసుకున్నారు.
Advertisement
Advertisement
Police
Slap
YS Vijayamma

More Telugu News